Telangana
పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కు ఉచిత శిక్షణపై అవగాహన సదస్సు -నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి
Quick Summary:
పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కు ఉచిత శిక్షణపై అవగాహన సదస్సు
నేటిసాక్షి, మిర్యాలగూడ : స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు సంబంధించి నేడు (గురువారం) ఉదయం 11 గంటలకు కళాశాలలో ఉచిత అవగాహన తరగతులను నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన, అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ తరగతులకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈ అవగాహనా సదస్సు తరువాత పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షకు ఉచిత కోచింగ్ తరగతులు కూడా నిర్వహింపబడుతాయని,ప్రతీ వారం పరీక్షలు నిర్వహించి, పోటీ పరీక్షలో నెగ్గే విధంగా అభ్యర్థులను తయారు చేస్తామని ప్రిన్సిపల్ తెలియజేసారు. కనుక ఈ సదవకాశాన్ని అర్హత కలిగినటువంటి అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.