నేటిసాక్షి, నల్లగొండ : పట్టణంలోని
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో వేసవి సెలవుల అనంతరం ఈ నెల 19 (శుక్రవారం) నుంచి డిగ్రీ, పీజి తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2026-2027 నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు పరుస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రతి విద్యార్థి తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీసం 75శాతం హాజరు ఉన్నవారికే ఉపకారవేతనాలు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. పూర్తి హాజరు శాతం ఉన్నవారినే పరీక్షలు రాయడానికి అనుమతిస్తామని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉపకారవేతనాలు మంజూరు అయ్యి, వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని అలా జమ అయినవారు, వెంటనే కళాశాలకు వచ్చి కళాశాల ఫీజు చెల్లించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ల సిలబస్ లో భారీ మార్పులు ఉన్నందున, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతేనే తరగతుల బోధన సరిగా జరుగుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana
ఎన్ జి కళాశాలలో ప్రారంభమైన తరగతులు -ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్
Quick Summary:
ఎన్ జి కళాశాలలో ప్రారంభమైన తరగతులు