Telangana
*మృతుల కుటుంబాలకు మాజీ మంత్రి ఓదార్పు* * గొడిశెలపేటలో పరామర్శించి సానుభూతి వ్యక్తం
Quick Summary:
*మృతుల కుటుంబాలకు మాజీ మంత్రి ఓదార్పు*
*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఓదార్పు అందించారు. గొడిశెలపేట గ్రామానికి చెందిన అల్క సుందర్, తడవేణి భూమమ్మ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సింహాచలం జగన్, మారం జలేందర్ రెడ్డి, గాజుల మల్లేశం, ఏలేటి కృష్ణారెడ్డి, పడిదం నారాయణ, పడిదం వెంకటేష్, మెతుకు స్వామి, అల్లే వెంకటేష్, అరికిల్ల మహేందర్, చింతల తిరుపతి, సాంబారి సత్యం, గంగాధరి శంకరయ్య, దొంత రాజయ్య, మెరుగు మహేందర్, నాంపల్లి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.