నేటి సాక్షి న్యూస్ జూన్ 30
పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామానికి చెందిన ఎస్. దీపిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చింది. ఏపీఆర్‌జేసీ బాలికల కళాశాల, బనవాసిలో విద్యనభ్యసిస్తున్న దీపిక విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబర్చడంతో మంగళవారం ఆమెకు ఘన సత్కారం లభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా దీపికకు ‘షైనింగ్ స్టార్’ అవార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో ఉన్నత విజయాలు సాధించవచ్చని దీపిక నిరూపించిందన్నారు. భవిష్యత్తులో ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
దీపిక సాధించిన ఘనత పట్ల తల్లిదండ్రులు వీరేష్, సునీతమ్మ హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె సాధించిన విజయంతో కుటుంబంతో పాటు గ్రామానికి కూడా మంచి గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు
Andhra
హెడ్లైన్ : రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన దీపికకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు
Quick Summary:
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన దీపికకు