నేటి సాక్షి, పరిగి.
(సురేష్ మోత్కూర్ )
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐపీఎస్ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పరిగి డివిజన్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నేడు తెల్లవారుజామున 05:00 గంటల నుండి పరిగి మండలం మల్లేమోనిగూడ గ్రామంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ (కార్డన్ అండ్ సెర్చ్) ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 160 మంది అన్ని రకాల ర్యాంకుల పోలీస్ అధికారుల బలగంతో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగాయి. గ్రామంలోని ప్రతి ఇల్లాన్ని, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా సోదా చేశారు.ఈ విస్తృత తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 39 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 31 చలాన్లు నమోదు చేసి, రూ. 12,245/- జరిమానా విధించారు.అనుమానస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను పాప్ లాన్ డివైస్ ద్వారా తనిఖీ లు చెయ్యడం జరిగింది. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీనివాస్ గారు ఈసందర్భంగా స్పష్టం చేశారు.కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, ఈ సందర్భంగా పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువతను పట్టి పీడిస్తున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, మహిళల భద్రత, ఆస్తిపాస్తుల రక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన రహదారి భద్రత నియమాలపై ప్రజలకు, యువతకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.ఇట్టి కార్యక్రమం లో పరిగి CI కొండల్ రెడ్డి, కొడంగల్ CI శ్రీధర్ రెడ్డి, పరిగి సబ్ డివిజన్ ఎస్.ఐ లు, సిబ్బంది, QRT సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
Telangana
*మల్లేమోనిగూడలో ముమ్మర ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ ప్రోగ్రాం – భారీగా వాహనాలు, మద్యం సీజ్*
Quick Summary:
మల్లేమోనిగూడలో ముమ్మర
