నేటి సాక్షి, శంకర్ పల్లి; జూన్ 11.( సుధాకర్ గౌడ్ )
పై అధికారుల ఆదేశానుసారం శుక్రవారం శంకర్ పల్లి మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈగల్ టీమ్ సమక్షంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నచిన్న వ్యాపార దుకాణాలు మరియు ఇతర ప్రజా ప్రదేశాలను సందర్శించి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు చెందిన నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్ "తేజ" (TEJA), దాని హ్యాండ్లర్ కె. ఆంజనేయులు, ఆర్ఎస్ఐ రాము, మోకిల WSI పద్మ సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. అక్రమంగా మాదక ద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా లేదా వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని దుకాణదారులు, ప్రజలకు సూచించారు.
Telangana
శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు..
Quick Summary:
ఈగల్ టీం ఆధ్వర్యంలో....