Telangana
మోటార్ సైకిళ్ల నిందితులను అరెస్టు చేసిన టు టౌన్ పోలీసులు
Quick Summary:
మోటార్ సైకిళ్ల నిందితులను అరెస్టు చేసిన
నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఒకటవ, రెండవ పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు మిర్యాలగూడ ఒకటవ, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు ఎం. నాగభూషణరావు, జె. సోమనర్సయ్య లు విలేఖరులకు మంగళవారం తెలిపారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేసిన నిందితుల వివరాలు వెల్లడించారు. నల్లగొండ మండలం ఆర్జాలబావికి చెందిన కొంగరి నవీన్ కుమార్, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట్లపాలెంకు చెందిన సోమిరెడ్డి సైదిరెడ్డి, దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన కంచరకుంట్ల సుమలతలను అరెస్టు చేసినట్టు తెలిపారు. మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, అనుమానస్పదంగా ఉన్న వారిని పోలీసులు వాహనాలు అపి, కాగితాలు చూపించమనగా వారు ఎటువంటి కాగితాలు చూపించకపోగా, పోలీసులు వెంటనే పలు విషయాలు ప్రశ్నించగా, బైకులు దొంగతనం చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుండి రెండు మోటార్ సైకిల్లు, బైకులు అమ్మితే వచ్చిన రూ. 1.38 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం చేసిన బైకులను తక్కువధరకు కొనుగోలు చేసి విడిబాగాలు చేసి అమ్మినందుకు అరెస్టు చేశామని తెలిపారు. ఆమె నుండి రూ.1.38లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. డిఎస్పీ కె. రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య, ఎఎస్ఐ షేక్ గఫ్ఫార్, హెడ్ కాన్స్టేబుల్ ఆర్. స్వర్ణకుమార్, పీసీ పి. బాలకృష్ణ,జి. కళ్యాణ్, సూరా, బి. మణిదీప్, సయ్యద్ సమద్, ఎండి. అక్బర్ పాషా, ఎం. రామకృష్ణ, ఎస్. రాజశేఖర్, ఎం. లక్ష్మయ్యలు దొంగలను పట్టుకున్న సందర్బంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.