నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
...........................................
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వినియోగానికి పనికిరాని విద్యుత్, కంప్యూటర్ మరియు వుడ్ ఆర్టికల్స్ బహిరంగ వేలం పారదర్శకంగా ముగిసింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్ పర్యవేక్షణలో యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు.వేలంలో ఉన్న వస్తువులను మూడు స్లాట్లుగా విభజించి బహిరంగంగా వేలం పాట నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నట్లు అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపిఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్. బీ డీఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, సైదులు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు మరియు కొనుగోలుదారులు పాల్గొన్నారు.
Telangana
*పారదర్శకంగా ముగిసిన వినియోగానికి పనికిరాని వస్తువుల వేలం* -------------------------------------------
Quick Summary:
*పారదర్శకంగా ముగిసిన వినియోగానికి పనికిరాని వస్తువుల వేలం*