*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
రాష్ట్రం లో ఎన్నికల సమయంలో ఎకరాకు ₹7,500 రైతు భరోసా ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… నేడు రైతులను నిరాశపరిచిందని,రెండు సీజన్లకు రైతులకు అందాల్సిన ₹55,800 కోట్లలో, ఇప్పటివరకు విడుదలైందని,కేవలం ₹27,080 కోట్లు మాత్రమే. మిగిలిన ₹28,720 కోట్ల బకాయిలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని,
హామీలు ఇచ్చి మర్చిపోవడం కాదు… రైతు చెమటకు గౌరవం ఇవ్వాలని, రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేయడం తగదు
రైతన్నకు రావాల్సిన ప్రతి రూపాయి వెంటనే విడుదల చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుందని,రైతు సంక్షేమమే తెలంగాణ అభివృద్ధికి పునాది అని
జీడిమెట్ల 132 డివిజన్
కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి వీరారెడ్డి అన్నారు.
Telangana
*రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించారని మండిపాటు* *-బిఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి*
Quick Summary:
బిఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి