నేటి సాక్షి కాగజ్ నగర్ జూన్ 23
కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్‌లో ఈరోజు నిర్వహించిన ఎస్‌ఐఆర్ ( ఎస్ ఐ ఆర్ ) మరియు బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సిర్పూర్ మాజీ శాసనసభ్యులు తదితరులు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు...
ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు* మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు ఓటు హక్కును కాపాడుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎవరూ ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
*సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ జగన్ మాట్లాడుతూ*, పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని, యువత, మహిళలు అధిక సంఖ్యలో పార్టీలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ*, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్రను ప్రజలకు వివరించాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
*సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప మాట్లాడుతూ,* నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని అన్నారు. పార్టీ అధిష్ఠానం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సిర్పూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
Telangana
కాగజ్‌నగర్‌లో ఘనంగా ఎస్‌ఐఆర్, బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు*
Quick Summary:
కాగజ్‌నగర్‌లో ఘనంగా ఎస్‌ఐఆర్, బి ఆర్ ఎస్ సభ్యత్వ