నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
.............................................
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.
సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై హైదరాబాద్ నుండి జగిత్యాలకు వస్తున్న షేరింగ్ కారును ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చింత అభిషేక్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న అభిషేక్ సొంతూరు జగిత్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంతో జగిత్యాల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Telangana
*రోడ్డు ప్రమాదంలో జగిత్యాల టెక్కీ మృతి* --------------------------------------------
Quick Summary:
*రోడ్డు ప్రమాదంలో జగిత్యాల టెక్కీ మృతి* -------------------------------