నేటి సాక్షి న్యూస్ జూన్ 17
మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం గ్రామంలో గురువారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, తెలుగు రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందిస్తూ, వారి సేవలను కొనియాడారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మరింత మమేకమై ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.
Andhra
హెడ్లైన్ : మాధవరం విజయోత్సవ సభలో పాల్గొన్న రమాకాంత్ రెడ్డి _ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
Quick Summary:
మాధవరం విజయోత్సవ....