*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట లో పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సోమవారం ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. సోమలింగం పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో 2021 జులై 6న సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 29 నుంచి జులై 6 వరకు సహకార వారోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు.
సహకార బ్యాంకులు, సహకార క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ( నాఫక్యూబ్ ) నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, జగద్గిరిగుట్ట బ్రాంచ్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్య నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్టీలు ప్లేట్లు పంపిణీ చేయడంతో పాటు భోజనం అందించారు. అలాగే విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, చీఫ్ మేనేజర్ జి. తాతాజీ, బ్రాంచ్ మేనేజర్ రామినేని నరేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ సిబ్బంది, ఉపాధ్యాయులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం సొసైటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
Telangana
*పేద విద్యార్థులకు చేయూత అందించాలి* *-ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. సోమలింగం*
Quick Summary:
ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. సోమలింగం*
