నేటిసాక్షి, మిర్యాలగూడ : రాబోయే రోజుల్లో రాజకీయంగా సరికొత్త వ్యూహాలతో దూసుకుపోయేందుకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలోని టిఎన్ఆర్ గార్డెన్స్ లో బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే & బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ఇంచార్జ్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మిర్యాలగూడ బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ఇంచార్జ్ & మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మరియు ఎమ్మెల్సీ ఎంసి. కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సభ్యత్వ నమోదు, ‘సర్’ ప్రక్రియే పార్టీకి శ్రీరామరక్ష అని, నేతల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ఇంచార్జ్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ,
పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ, మిర్యాలగూడలో మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తాం అని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, డిజిటల్ మెంబర్‌షిప్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను డిజిటల్‌గా అనుసంధానం చేసి, పార్టీ అండగా నిలుస్తుందని, అలాగే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సర్ ప్రక్రియపై ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో అక్రమాలను అడ్డుకునేలా గులాబీ సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి పోరాటాలకు సన్నద్ధం కావాలని,
ఈ సమావేశం కేవలం అంతర్గత సమీక్షకే పరిమితం కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేడర్‌కు దిశా నిర్దేశం చేసిందని, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు భరోసా: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎండి.మోశిన్ అలీ, ఎండి. యూసుఫ్, నల్లమోతు సిద్ధార్ధ, ధనావాత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, జొన్నలగడ్డ రంగా రెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి.ఇలియాస్ ఖాన్,అంగోతు హతిరాం నాయక్, ఎండి.మగ్దుం పాషా,పెద్ది శ్రీనివాస గౌడ్, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మాజీ వైస్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, టౌన్ మరియు మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వందలాది మంది గులాబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ -బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్.... -మిర్యాలగూడలో ఘనంగా డిజిటల్ మెంబర్‌షిప్ & ‘సర్’ పై సమీక్షా సమావేశం -కేడర్‌లో నూతన ఉత్సాహం నింపిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రసంగాలు -మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో.... కదంతొక్కిన గులాబీ దళం -మిర్యాలగూడలో మళ్ళీ..గులాబీ జెండా ఎగరవేస్తాం : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
Quick Summary:
కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి

