*నేటిసాక్షి,నల్లబెల్లి*
సామరస్యంగా ఆలోచించి తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు.
ఈనెల 20 న నర్సంపేట కోర్టు పరిధిలో నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉన్న కేసులను వేగంగా, సులభంగా పరిష్కరించుకోవడంతో పాటు సమయం, ధనం, శ్రమను ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులకు పూర్తి చట్టబద్ధత ఉండటమే కాకుండా, అవి తుది తీర్పుతో సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీకి అవకాశం ఉన్న కేసుల పక్షాలు ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని పరస్పర అవగాహనతో వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు.
ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని న్యాయపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని ఆయన కోరారు.
Telangana
*సామరస్యంగా కేసులు పరిష్కరించుకోండి* *ఎస్సై సాయి ప్రసన్న కుమార్*
Quick Summary:
*సామరస్యంగా కేసులు పరిష్కరించుకోండి*