నేటి సాక్షి గజ్వేల్ :--===
జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు చిన్నారుల విద్యను వ్యాపారంగా మార్చి ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీసీ సంఘం సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము ఉమేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, యూనిఫాంలను పాఠశాలల ద్వారానే అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయని ఆరోపించారు. విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలను గుర్తించి సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపట్టడంతో పాటు అవసరమైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాజు, బాబు, లక్ష్మణ్, మల్లేశం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
అధిక ఫీజుల దోపిడీ ఆపకపోతే ప్రైవేట్ స్కూళ్లకు తాళాలు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము ఉమేష్ యాదవ్
Quick Summary:
అధిక ఫీజులు దోపిడీ ఆపకపోతే.....