నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
........................................
జగిత్యాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్టా కార్తీక్, ప్రధాన కార్యదర్శి మెరుగు జంపన్న, అలియా జానీ, ఉపాధ్యక్షులు గణవేని నందిని, మల్లేష్ యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముత్యాల స్వామి ఆధ్వర్యంలో జగిత్యాల మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన ధీకొండ ప్రేమ్‌నాథ్‌ను మండల ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా నియమించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉపసర్పంచులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణతో పాటు గ్రామీణాభివృద్ధికి కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
Telangana
*జగిత్యాల మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటు* *• ఉపాధ్యక్షుడిగా ధీకొండ ప్రేమ్‌నాథ్ ఎంపిక* -----------------------------------------
Quick Summary:
జగిత్యాల మండల ఉపసర్పంచుల ఫోరం