నేటి సాక్షి, శంకర్ పల్లి; జూలై 08.( సుధాకర్ గౌడ్)
శంకర్ పల్లి మండలం ఇరుకుంట తండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ గాలివీస్తున్నదని ఎక్కడ చూసినా పలు పార్టీల కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనతో రైతులు చాలా నష్టపోయారని తెలిపారు. సరి అయిన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అష్ట కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ పల్లి ప్రధాన చౌరస్తాలో గల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ డి. గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్, బుల్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ భానూరి కృష్ణ, మహారాజ్ పేట్ మాజీ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, నాయకులు వాసుదేవ్ కన్నా,దేశ మల్ల ఆంజనేయులు, విజయకుమార్, మన్నే లింగం ముదిరాజ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Telangana
బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన ఇరుకుంట తండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్..
Quick Summary:
శంకర్ పల్లి మండలం ఇరుకుంట తండా
