*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఏ. గోపాల్ రావును రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ సందర్భంగా వనపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ పార్టీలో నిబద్ధతతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏ. గోపాల్ రావు తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పనిచేసి రంగారెడ్డి జిల్లా అర్బన్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
Telangana
*రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఏ.గోపాల్ రావు నియామకం*:
Quick Summary:
ఏ.గోపాల్ రావు నియామకం*: