నేటి సాక్షి జూలై 08 ఆత్మకూరు :-
శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని, నల్ల కాలువ గ్రామం వద్ద ఉన్న స్మృతివనంలో
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ గా వెళ్ళి నంద్యాల టర్నింగ్‌లోని, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొని, కార్యక్రమాన్ని నిర్వహించి మహానేత సేవలను స్మరించుకున్నారు.
తదనంతరం వైఎస్ఆర్ స్మృతివనంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మండల మరియు పట్టణ అధ్యక్షులు సయ్యద్ మీర్, మాజీ అధ్యక్షుడు అంజాద్ అలీ, నాయకులు మోమిన్ మునీర్ భాష, మోమిన్.ముస్తఫా, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Andhra
*ఆత్మకూరులో మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*
Quick Summary:
డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించిన
