Telangana
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలి -మండల వ్యవసాయ అధికారి రూషేంద్రమణి
Quick Summary:
మండల వ్యవసాయ అధికారి రూషేంద్రమణి
నేటిసాక్షి, మిర్యాలగూడ : రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను వినియోగించి, యూరియా ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకుని సులభంగా పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్రమణి తెలిపారు. బుధవారం పిఎసిఎస్ ఆలగడప సొసైటీని తనిఖీ చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో ఇప్పటివరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 27,039 యూరియా బ్యాగులు బుక్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పిఎసిఎస్ ఆలగడప, అన్నారం, తడకమళ్ళ, తుంగపాడు కేంద్రాల్లో యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువులను పొందాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు సీఈఓ నాగయ్య, సైదులు, ప్రవీణ్, వెంకట్రాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.