నేటి సాక్షి వికారాబాద్:
వికారాబాద్ జిల్లా సర్పంచ్ ల పంచాయతీ సెక్రటరీ ల శిక్షణా కార్యక్రమం లో భాగంగా బుధవారం బంట్వారం, ధారూర్, కొటేపల్లి, మర్పల్లి, మొమిన్ పేట్, వికారాబాద్,నవాబ్ పేట్ మండలాల యొక్క సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GP-SAP), వీబీ -జి రామ్ జి పథకం, సెంట్రల్ ఫైనాన్సియల్ గ్రాంట్స్ యొక్క రూల్స్, ఘాన వ్యర్థాల యొక్క నిర్వహణ రూల్స్, 2026, జల సిరి,ఇతర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ పథకాల గురుంచి చెప్పడం జరిగింది.
ఇందులో భాగంగా ఉమా శంకర్ ప్రసాద్,, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మాట్లాడుతూ అందరు సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీలు ఈ శిక్షణ లో అన్ని జాగ్రత్తగా విని అన్ని గ్రామాల్లో అమలు పరిచి అన్నిటిని ఆదర్శ గ్రామ పంచాయతీలు గా తీర్చిదిద్దాలని కోరడమైనది మరియు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో తయారు చేయాలని చెప్పడం జరిగింది.
ఈ శిక్షణ లో కమీషనర్ పంచాయతీ రాజ్ ఆఫీస్ యొక్క జిల్లా స్పెషల్ ఆఫీసర్ నీరజ రెడ్డి, డి.ఆర్.డి.ఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, ఉమేష్ ఇ ఇ పి ర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం. అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్.
Quick Summary:
అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్.
