*నేటిసాక్షి కుత్బుల్లాపూర్,*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు,
సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు సైతం ఆరోగ్య భద్రత కల్పించాలని, ఇందుకుగాను ఇప్పటికే ప్రారంభించి అమలు చేస్తున్న ఈ హెచ్ ఎస్ తో పాటు జి హెచ్ ఎస్ పథకాన్ని కూడా పునః ప్రారంభించాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) హెచ్–143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సూరారంలోని విఐపీ ఫంక్షన్ హాల్‌లో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్కాని మారుతి సాగర్ శిబిరాన్ని ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 లక్షల కుటుంబాలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 వేలకు పైగా ఉండే జర్నలిస్టులను విస్మరించడం అన్యాయమన్నారు. వెంటనే జర్నలిస్ట్ హెల్త్ స్కీం పునరుద్ధరించాలని ఆయన కోరారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కూడా అదే స్థాయిలో సంరక్షించుకోవాలని అన్నారు. వృత్తి ఒత్తిళ్లు, నిరంతర విధి నిర్వహణ మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని ఆయన సూచించారు.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి జర్నలిస్టులకు యూనియన్ సభ్యత్వాలను తన చేతుల మీదుగా అందజేశారు.
శిబిరంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల నుంచి ఆరోగ్య పరిరక్షణపై సూచనలు, సలహాలు పొందారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలేపాక వెంకట్, సీనియర్ జర్నలిస్టులు సురేందర్, కళ్యాణ్, శివ, టీయూడబ్ల్యూజే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, కన్వీనర్ ఎర్రోళ్ల కృష్ణ, ఉపాధ్యక్షులు బాన్స్వాడ వెంకటేష్, శ్రీనివాస్, సాయిలు,అనంతరావు,కార్యనిర్వాహక కార్యదర్శులు యెర్రం పెంటయ్య, యాకూబ్, సందీప్, సూర్యచందర్, కార్యవర్గ సభ్యులు సతీష్, పల్నాటి శివకుమార్, రాజు,బక్కని పాండురంగం, బిక్షపతి, బాబు, శివకుమార్, రవి, మహేష్, ప్రసాద్ లతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
Telangana
*టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం* *-ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్*
Quick Summary:
ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్*