నేటి సాక్షి 10 జూలై పాములపాడు :-
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రం లోని కస్తూర్బా పాఠశాల ను, ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
పాములపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతులు, భోజనాన్ని పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కస్తూర్బా పాఠశాల ప్రినిపాల్ రాజ్యలక్ష్మి వారిని ఆరా తీశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పిల్లలకు సరైన టైం లో పిల్లలకు భోజనాలు పెట్టాలి. ప్రతి రోజు మెనూ కచ్చితంగా పాటించాలి అని ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎమ్మెల్యే వారు క్లాస్ రూమ్ లకు వెళ్లి వారి ప్రతిభ నీ అడిగి తెలుసుకున్నారు. తరువాత వాస్ రూమ్స్ మరియు స్టోర్ రూమ్ పరిశీలించారు.వంట సిబ్బంది కి కూడా వారు నాణ్యమైన ఆహారం పిల్లలు కు వండి పెట్టాలి.మీరు మీ పిల్లలుకు ఇంటి దగ్గర ఎల చూసుకుంటారో ఇక్కడ కూడా ఈ స్కూల్ విద్యార్థినులకు మంచి భోజనాలు చేసి పెట్టాలని ఆదేశం ఇచ్చారు.పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నం వడ్డించారు..
ఈ సందర్భంగా: క్లాసులు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే స్వయంగా చదువులో మెళకువలు, లక్ష్య సాధనకు అవసరమైన అంశాలను తెలియజేసి విద్యార్థినుల్లో ఉత్సాహం నింపారు. చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని, ఉన్నత విద్యతోనే జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయని విద్యార్థినులకు ఎమ్మెల్యే గారు సూచించారు.
అనంతరం: ఎమ్మెల్యే గారు విద్యార్థినులకు మధ్యాహ్నం భోజనం వడ్డించడం జరిగింది.
Andhra
పాములపాడు మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గిత్త. జయసూర్య.
Quick Summary:
ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గిత్త.