Telangana
ఇంటింటి గృహ గణన ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ
Quick Summary:
గణన ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ
నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి గృహ గణన ప్రక్రియను మిర్యాలగూడ ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి రమాణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. మిర్యాలగూడ మండలంలోని బాధలాపురం గ్రామం పోలింగ్ స్టేషన్ నెం.179, గూడూరు గ్రామంలోని పోలింగ్ స్టేషన్లు నెం.190,191లను సందర్శించి గృహ గణన పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్లకు సూచించారు. ప్రతి ఇంటి వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేసి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మిర్యాలగూడ ఆర్డీఓ & ఎన్నికల నమోదు అధికారి రమాణారెడ్డి ఆదేశించారు. ఈ తనిఖీలలో సంబంధిత బిఎల్ఓ లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.