నేటి సాక్షి 10 జూలై పాములపాడు :-
ఈరోజు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య పాములపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపిడిఓ ఆఫీసు నందు ఎంపిడిఓ చంద్రశేఖర్ ఎమ్మెల్యే వారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు తర్వాత పూలమాలలతో తహసీల్దార్ సుభద్రమ్మ వారు శాలువాలతో సన్మానం చేయడం జరిగింది.(గ్రీవెన్స్ డే )నిర్వహించి 'ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ఎమ్మెల్యే గారు వారి సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హౌసింగ్, పెన్షన్లు, విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలతో పాటు తక్కువ వోల్టేజ్ సమస్యపై అనేక వినతులు అందాయి. ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది ఎమ్మెల్యే గారు
మిగిలిన దీర్ఘకాలిక సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని అత్యంత ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ: ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం, ప్రతి కుటుంబ సమస్యకు పరిష్కారం చూపడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నా కృషి కొనసాగుతుంది పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మండల కన్వీనర్ రవీంద్రా రెడ్డి, తెలుగు యువ నాయకుడు కరీం భాష, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, హరినాథ్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ రాయపాటి గోవిందు, మండల నాయకులు
Andhra
ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే గిత్త. జయసూర్య.
Quick Summary:
మన ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే గిత్త. జయసూర్య.

