నేటిసాక్షి, మిర్యాలగూడ : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా చింతకాని మండలం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.1,009.15 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులు సుమారు 1.44 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేయగా, మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించారు.
మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) రుషేంద్రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు పార్వతి, నాగయ్య, అఫ్రీన్, గోపి, రైతులు ఇజ్రాయెల్, సురేందర్ రెడ్డి, కోటిరెడ్డి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
రైతు వేదికలో సీఎం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష వీక్షణ
Quick Summary:
రైతు భరోసా నిధుల విడుదల