నేటి సాక్షి, పరిగి
(సురేష్ మోత్కూర్ )
పరిగి మున్సిపల్ ఆఫీస్ వారు వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన ఎస్ ఐ ఆర్ హెల్ప్ డెస్క్ లలో పర్యటించిన పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేపల్లి రామకృష్ణారెడ్డి.ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... నిజమైన ఓటరు నష్టపోకుండా చూడాలని, ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని ఎవరు కోల్పోకూడదని, పరిగి మున్సిపల్ శాఖ వారు వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను ప్రజలు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ మీకిచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్లను నింపి బి ఎల్ ఓ లకు ఇవ్వాలని నింపడానికి ఇబ్బంది అయినవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు వస్తే ఇక్కడే వారి ఫారాలను నింపి తీసుకోవడం జరుగుతుందని దీనిపైన మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్న బి ఎల్ ఓ లకు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే, టి పి సి సి ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి వార్డులలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నియమించబడిన బి ఎల్ ఏ లు మీ బూతులలో బి ఎల్ ఓ లతో సమన్వయ పరుచుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ఎండి ఎజాజ్,బాదం అఖిల శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ నియమించిన బి ఎల్ ఏ లు నాగరాజు, మీర్జా, అనిల్, మల్లేష్, మణికంఠ, బాలు, సత్తయ్య,గౌతం, రవికాంత్, శ్రీధర్, తదితరులు పాల్గొనడం జరిగింది.
Telangana
*ఎస్ ఐ ఆర్ పరిగి హెల్ప్ డెస్క్ ను పర్యవేక్షణ చేసిన రామకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షులు.*
Quick Summary:
కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షులు.