నేటిసాక్షి, మిర్యాలగూడ, జూలై 11: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సందర్శించి రోగులు, బాలింతలతో మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన మిర్యాలగూడ పట్టణ 37వ వార్డు కాంగ్రెస్ నాయకుడు గుంజా శ్రీనివాస్ మనవరాలిని పరామర్శించిన ఎమ్మెల్యే చిన్నారికి ఆశీస్సులు అందజేసి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే, చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రసవించిన బాలింతలను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తదుపరి డ్యూటీలో ఉన్న వైద్యులతో సమావేశమైన ఎమ్మెల్యే, రోజువారీ ప్రసవాల సంఖ్య, ఓపీకి వచ్చే రోగుల వివరాలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మందులు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన :ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన :

