నేటి సాక్షి జూలై నందికొట్కూరు :-
నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రం లోని ఏపీ.జె.ఎ.సి రాష్ట్ర చైర్మన్ శ్రీ అలపర్తి.విద్యాసాగర్ జనరల్ సెక్రెటరీ కె. ఎస్.ఎస్.ప్రసాద్ గార్ల ఆదేశాల మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కు దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనలో భాగంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం జరిగింది. అనంతరం ఈరోజు ఎన్జీవోఎస్ భవన్ నందికొట్కూరు సమావేశం ఏర్పాటు చేసినా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు ఏ.రాముడు జేఏసీ చైర్మన్ వైస్ చైర్మన్లు మూర్తుజవళి, యుటిఎఫ్ స్వామినాథన్, ఏపీటీఎఫ్ ఆంజనేయులు, డిటిఎఫ్ సెక్రెటరీ సత్యనారాయణ,సుధాకర్ యుటిఎఫ్ సంఘాలతో సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఏ.ఐ.సి.సి.టు. యు కార్మిక సంఘం నాయకులు, పిక్కిలి.వెంకటేశ్వర్లు,కాటేపోగు,సామన్న సంఘీభావం తెలియజేశారు.సమావేశంలో దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేలా గౌరవనీయులైన ఎమ్మెల్యే గిత్త. జయసూర్య గారిని కలవాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లెవ్ లను వేతన సవరణ నాలుగు డిఏలు మంజూరు చేయాలని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు, పూర్తిస్థాయిలో సి.పి.ఎస్ రద్దు,పది అంశాలతో వినతి ప్రతిపత్రం ఎమ్మెల్యే గారిని కలిసి ఇవ్వాలని JAC కమిటీ తీర్మానం చేశారు సోమ మంగళ వారాల్లో ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం సమర్పించాలని జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్లు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Telangana
ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల సమస్యల వెంటనే పరిష్కరించాలి. ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు ఏ. రాముడు ..
Quick Summary:
ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు ఏ. రాముడు ..
