నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.........................................
జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya) శాశ్వత భవన నిర్మాణానికి 2026 జూలై 12వ తేదీ (ఆదివారం) ఉదయం 11.00 గంటలకు చల్‌గల్ గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఐఏఎస్ తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కోరుట్ల శాసనసభ సభ్యులు సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి విశిష్ట అతిథిగా హాజరవుతుండగా, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు దివాకొండ దామోదర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు జి. వంశీకృష్ణ , శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, కేంద్రీయ విద్యాలయ సంఘటన హైదరాబాద్ రీజియన్ ఉప కమిషనర్ సంతోష్ కుమార్ ఎన్. , వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.
జిల్లాలో నాణ్యమైన కేంద్ర విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు జగిత్యాల జిల్లా కు ఒక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Telangana
*రేపు చల్‌గల్ లో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్* ----------------------------------------
Quick Summary:
రేపు చల్‌గల్ లో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి