నేటి సాక్షి జూలై 15
పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
డీలర్ ఉలిగప్ప, నాగేంద్ర, శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో యోసేపు, ప్రసంగి, ఆదాము, జయపాల్, ఆనంద్, దావీదు, గుంటప్ప, సైమన్, యువరాజు, జక్రయ్య, రాజన్న, సురేష్, యాకోబ్, యేషయ్య, మనోహర్, దేవదాసు, నాగేష్, మిఖాయేలు, పౌలయ్య, స్వామిదాస్, బజారి, అనిల్, కిరణ్, బి. దావూద్, చిన్నోడు, శాంతిరాజు తదితరులు పార్టీలో చేరారు.
చేరికల సందర్భంగా ఎన్. రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల విశ్వాసాన్ని మరింతగా నిలబెట్టుకునేలా కృషి చేస్తామని తెలిపారు.
Andhra
వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 30 కుటుంబాలు
Quick Summary:
పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో