Telangana
ఈనెల 16న 'సర్' పైన అవగాహన సదస్సు...
Quick Summary:
ల్ ఎంటెన్సివ్ రివిజన్ "సర్" పైన ఉన్న అనుమానాలు, అపోహలు
నేటిసాక్షి, మిర్యాలగూడ :స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్ "సర్" పైన ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి చేయడం కోసం ఈ నెల తేదీ 16న (గురువారం) స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని గ్రంథాలయంలో ఉదయం 10గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ ఫోరం, జన విజ్ఞాన వేదిక, మరో గ్రంథాల ఉద్యమం నాయకులు డాక్టర్ రాజు, డా. మువ్వా రామారావు, కస్తూరి ప్రభాకర్, కందుకూరి సుదర్శన్ లు తెలిపారు. మంగళవారం మిర్యాలగూడలోని గ్రంథాలయం వద్ద సెమినార్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సర్ ఓటర్ ఫారాలు నింపడం పైన ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని, వాటికి సంబంధించిన అనేక అంశాలను నివృత్తి చేయడం కోసం తెలంగాణ గ్రంధాలయ చైర్మన్ మహమ్మద్ రియాజ్, సామాజిక విశ్లేషకులు విద్యావేత్త రమేష్ పట్నాయక్, లతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ పార్టీలు, యువకులు, ప్రజలు హాజరై, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్యాంసుందర్, సహాయ అధికారి సుధాకర్, జే వి వి నాయకులు కొండల్ రెడ్డి, రీడర్స్ సిహెచ్ రమేష్, సునీల్, క్రాంతి, లవన్, సందీప్, రాంబాబు, వెంకటేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.