నేటి సాక్షి జూలై 15
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో పెద్దకడబూరు మండలం గణనీయమైన పురోగతి సాధించినట్లు తహశీల్దార్ వలీబాషా తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 100 శాతం మేర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తైనట్లు పేర్కొన్నారు. పెద్దకడబూరులో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఈవోఆర్డి జయరాముడుతో కలిసి తహశీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, సంబంధిత సిబ్బందితో మాట్లాడి ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఓటర్ల వివరాల నమోదు, సవరణ, ధ్రువీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన పత్రాలను నేటి సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వలీబాషా వెల్లడించారు.
Andhra
పెద్దకడబూరులో ఓటరు జాబితా సవరణకు 100 శాతం పురోగతి
Quick Summary:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
