నేటి సాక్షి జూలై 14 నంద్యాల :-
నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి శ్రీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు, స్టేషన్ రికార్డులు, కేసు నమోదు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామాల్లో పోలీసింగ్ విధానం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
తదుపరి జానాలగూడెం చెంచు గ్రామాన్ని స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఐకమత్య వాతావరణాన్ని కొనసాగిస్తూ ఎలాంటి గొడవలు, వివాదాలకు తావు ఇవ్వకుండా పరస్పర సహకారంతో జీవించాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి కుటుంబం కృషి చేయాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, "ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీసు శాఖ యొక్క అత్యున్నత ప్రాధాన్యత. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది" అని తెలిపారు.
Andhra
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, ఐపీఎస్. *జానాలగూడెం చెంచు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా ఎస్పీ* *ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి...*
Quick Summary:
*ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి
