*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా డి సి సి కార్యదర్శి తడగొండ విజయ్ కుమార్ మాట్లాడ్తూ. కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే బి ఆర్ ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కు.బి ఆర్ ఎస్ పాలనకు వ్యాత్యాసం వివరిస్తూ మొన్నటిదాకా కాళేశ్వరం అంటేనే స్కాం అని మాట్లాడిన జీవన్ రెడ్డి ఈ రోజు అదే కాళేశ్వరం గురించి మాట్లాడడం విడ్డురంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కెసిఆర్ కి ఎటిఎం గా మారిందని, దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనడం కంటే అవినీతి ప్రాజెక్ట్ అనడం కరెక్ట్ అని స్వయంగా జీవన్ రెడ్డి అన్నారు. ఇపుడు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక కాగానే జీవన్ రెడ్డి కి కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పగా ఎలా కనిపిస్తుందో చెప్పాలి. ఆర్ ఎస్ ప్రవీణ్ బి ఎస్ పి లో ఉన్నపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తెల్ల ఏనుగుతో పోల్చారు. ఇపుడేమో కాళేశ్వరం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత నది మీద తమ్మిడిహుట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి కేవలం కాలువల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి నీటిని మల్లించి ఎటువంటి ఖర్చు లేకుండా సుమారు 3వేల కోట్ల తో ప్రాజెక్ట్ పూర్తి చేయాలనీ శ్రీకారం చుట్టారు. దీన్ని కెసిఆర్ రి డిసైనింగ్ పేరుతో తమ్మడిహుట్టి దగ్గర కట్టవలసిన ప్రాజెక్ట్ ను మెడిగడ్డ వద్ద మొదట సుమారు 40 వేల కోట్లతో మొదలు పెట్టి తరువాత సుమారు ఒక లక్ష కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినారు. అంటే ముందు ఒక ప్రాజెక్ట్ కడితే దానికి ఎంత ఖర్చు వస్తదో ఎస్టిమేషన్ అంచనా ఖర్చు వేసి మొదలు పెడ్తారు కానీ మీరు ప్రాజెక్ట్ మొదలు చేసేటపడు చెప్పిన ఖర్చు ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు మూడింతల ఖర్చు ఎలా అయ్యింది. అంటే కనీసం మీకు ప్రాజెక్ట్ మీద మొదలు పెట్టేటపుడు కనీసం అవగాహన లేదా లేక తెలంగాణ ప్రజలు మేం ఏది చెప్తే అది వింటారు అనుకున్నారా
తమ్మిడిహుట్టి వద్ద ప్రాజెక్ట్ కడితే తక్కువ ఖర్చు తో వచ్చే నీళ్లను లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసినారు.
కొందరు బి ఆర్ ఎస్ నాయకులు కనీస అవగాహనా లేక కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే ఎం ఐతుంది అని మాట్లాడుతున్నారు కదా. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కుంగింది లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే దాని నాణ్యత లోపం కాదా. పేదప్రజలకోసం కట్టిన ప్రాజెక్ట్ లేమో కులాలే కానీ.మీరు కట్టుకున్న ఇండ్లు వందల సంవత్సరాలు దృడంగా ఉండాలనా.కాంగ్రెస్ ప్రభుత్వం 1963 లో కట్టి ఉత్తర తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరందిస్తున్న ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ ఇప్పటికి చెక్కుచెదారకుండా ఉంది. మీకు కనిపిస్తలేదా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు ఎన్ని కథలు చెప్పిన బి ఆర్ ఎస్ పార్టీని నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం మానుకోవాలి అని జగిత్యాల జిల్లా డి సి సి కార్యదర్శి తడగొండ విజయ్ కుమార్ హెచ్చరించారు
Telangana
కెసిఆర్ కుటుంబం కట్టుకున్న ఫామ్ హౌస్ పిల్లర్లు ఎందుకు కుంగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్స్ ఎందుకు కుంగినయ్ ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ గురించి తీసిన మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు కె సి ఆర్ పాలనకి జె జె లు కొట్టడం విడ్డూరం జగిత్యాల జిల్లా డి సి సి కార్యదర్శి తడగొండ విజయ్ కుమార్
Quick Summary:
కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్స్ ఎందుకు కుంగినయ్