నేటి సాక్షి జూలై 14 నందికొట్కూరు :-
నందికొట్కూరు తాలూకా బొల్లవరం గ్రామంలో రైతుసేవ కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడుతూ ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖలలో రైతులకు కావలసిన విత్తనాలు, కొత్త వంగడాలు ఇతర ఇన్పుట్ జింక్ సల్ఫేట్ ( ముడి జింకు ), కార్పలింక్స్, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై కావలసినవి తెలిసిపరుచుకోవచ్చని తెలిపారు.
అంతేకాకుండా ఇతర పురుగు, తెగుళ్లు నివారణకు చేపట్టవలసిన కంట్రోల్ మేజర్స్ తెలుసుకోవచ్చని తెలిపారు. మినుములు వేసిన రైతు వెంటనే పంట నమోదు చేసి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. పొటాష్ ఎరువులు రైతు సేవా కేంద్రాల ద్వారా తెప్పించాలన్నారు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తోందిని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు నాయకులు పాల్గొనడం జరిగింది
Andhra
పొలం పిలుస్తోంది కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే.గిత్త.జయసూర్య. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొలం పిలుస్తోంది . ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య.
Quick Summary:
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా

