నేటిసాక్షి,
మిర్యాలగూడ : మండల పరిధిలోని లక్ష్మీపురం–రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా గ్రామాల మధ్య ఉన్న చెరువుకు గండి పడటంతో చెరువులోని నీరు పూర్తిగా వృథాగా వెళ్లిపోతుండగా, సాగునీటి సమస్య తలెత్తి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సమాచారంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే స్పందించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి బుధవారం సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే చెరువును పరిశీలించి, గండిని అత్యవసర ప్రాతిపదికన పూడ్చి నీరు వృథా కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి కొరత ఏర్పడకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని సూచించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా లక్ష్మీపురం–రుద్రారం చెరువు వద్ద శాశ్వత పరిష్కారంగా, లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని మంజూరు చేసి, నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
రైతులకు ఇబ్బందులు కలగకుండా చెరువు గండిని వెంటనే పూడ్చాలి -అధికారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాలు
Quick Summary:
మిర్యాలగూడ : మండల పరిధిలోని లక్ష్మీపురం–రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా
