నేటి సాక్షి,పరిగి
(సురేష్ మోత్కూర్ )
బడంపల్లి గ్రామంలో చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందులో దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు 20 మంది వరకు ఉన్నారు. వారు ఉదయం కళాశాలకు వెళ్లడానికి సమయానికి బస్సు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పరిగికి వెళ్లడానికి కూడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బడంపల్లి సర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి పరిగి డియ్యం గారికి వినతిపత్రం అందించారు. బడేంపల్లి నుండి దోమకు, బడంపల్లి నుండి పరిగికి, ఉదయం 8 గంటలకు బస్సులు,సాయంత్రం 5 గంటలకు బస్సులు వేయగలరని విన్నవించారు.
Telangana
*బడంపల్లి వాసులు పరిగి డిఎంకి వినతి పత్రం.*
Quick Summary:
బడంపల్లి గ్రామంలో చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందులో దోమ