నేటి సాక్షి ధర్మపురి మైనారిటీ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ"
ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనారిటీ పాఠశాలలో ఈరోజు నూతనంగా 5వ తరగతి విద్యార్థులకు భోజన ప్లేట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మరియు భోజనశాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.విద్యార్థుల విద్య, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ సహకారాలతో పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, విద్య మరియు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ప్రేమ, బాధ్యతతో వ్యవహరిస్తూ వారికి మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు
Telangana
ధర్మపురి మైనారిటీ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ"
Quick Summary:
విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ"

