నేటి సాక్షి జూలై 16
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబలం గ్రామానికి చెందిన మహాలక్ష్మి తన నలుగురు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మారుతి తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మహాలక్ష్మి తిరిగి ఇంటికి చేరుకోలేదని, కుటుంబ సభ్యులు, బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని, మహాలక్ష్మి మరియు ఆమె పిల్లల ఆచూకీ తెలిసిన వారు వెంటనే పెద్దకడుబూరు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ మారుతి విజ్ఞప్తి చేశారు.
Andhra
నలుగురు పిల్లలతో మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
Quick Summary:
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబలం
