*నేటి సాక్షి – కోరుట్ల*
*"ఒక్క క్షణం నిర్లక్ష్యం... ఓ కుటుంబంలో తీరని విషాదం. పాఠశాల వయసులో ఉన్న ఇద్దరు బాలురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో వారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడిన విషాదకర ఘటన గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని వేములవాడ రోడ్డుపై చోటుచేసుకుంది."*
*ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర విషాదం*
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి జశ్వంత్ (13), మగ్గిడి చాణక్య గ్లామర్ మోటార్‌సైకిల్‌పై వేములవాడ రోడ్డు వైపు వెళ్తుండగా, అదే మార్గంలో వచ్చిన డీజిల్ ట్యాంకర్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు జశ్వంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. చాణక్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*విషాదంలో మునిగిన కుటుంబం.. దర్యాప్తు ప్రారంభం*
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, కోరుట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వేములవాడ రోడ్డుపై తీవ్ర విషాద వాతావరణం నెలకొనగా, బాలుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
------
Telangana
*అక్కడికక్కడే.. పాపం.!* ----------------------- * వేములవాడ రోడ్డుపై ఘోర ప్రమాదం * డీజిల్ ట్యాంకర్ ఢీకొని 13 ఏళ్ల బాలుడు దుర్మరణం.. మరో బాలుడికి తీవ్ర గాయాలు --------
Quick Summary:
వేములవాడ రోడ్డుపై ఘోర ప్రమాదం
