నేటి సాక్షి గజ్వేల్: రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ జుబేర్ పాషా ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నా, రైతుల ఆవేదనను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా తగిన వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తిన పంటలు కూడా నీటి కొరతతో ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వారిని పరోక్షంగా ఆత్మహత్యల వైపు నెట్టేస్తోందని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీడు భూముల్లో బంగారం పండేలా సాగునీటి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రాజెక్టులు జిల్లాలో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు సాగునీటి కోసం ఉద్యమానికి దిగే పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలోని అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Telangana
రైతులను ఆత్మహత్యల వైపు నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: జూబేర్ పాషా
Quick Summary:
రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చే