నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా. సుధాకర్ లాల్ మన్నెగూడలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (AAM) ను సందర్శించి, భవన మౌలిక సదుపాయాలు వైద్య సేవల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భవనంలోని వివిధ సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, అవసరమైన ఇతర మౌలిక వసతులు, అలాగే కేంద్రం ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నదా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఆమ్ సెంటర్‌ను ప్రారంభించే ముందు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మందులు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు.
గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ నూతన ఆమ్ సెంటర్ ప్రారంభం ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు తల్లి–శిశు ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమం, వ్యాధుల నివారణ చర్యలు ఇతర ప్రజారోగ్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని డీఎంహెచ్ఓ తెలిపారు.
ఈ తనిఖీలో డా. మహమూద్ ఫరూఖీ, డా. అజయ్, సీహెచ్‌ఓ శ్రీ పద్మ , మహేష్ కుమార్,ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Telangana
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన. వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ లాల్.
Quick Summary:
వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ లాల్.
