నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూలై 18
చౌడేపల్లి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" (లేదా 'స్వచ్ఛతా హి సేవ') కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు శ్రమదానం చేస్తున్నారు. ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా.. పోలీసు అధికారులు, సిబ్బంది స్వయంగా తమ పోలీస్ స్టేషన్లు, పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటుతున్నారు.అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ *ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు శనివారం చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నెలా మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణం పరిసరాలను అధికారులు, సిబ్బంది శ్రమదానంతో శుభ్రం చేశారు. గడ్డపారలు, గుణపాలతో చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, చిన్న గుంతలను పూడ్చివేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకున్నారు. పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్. ఎస్సై చిన్నారెడ్డప్ప. సిబ్బంది పాల్గొన్నారు,
Andhra
పోలీస్ స్టేషన్ లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
Quick Summary:
చౌడేపల్లి మండలంలో ప్రతిష్టాత్మకంగా