నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
.......................................
వారాహి దేవి నవరాత్రుల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం చవితి తిథి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితమాత ఆలయంలో నిర్వహిస్తున్న వారాహి అమ్మవారు దూమ్రా మాత అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
ప్రకృతికి, పంటలకు అధిదేవతగా కొలిచే దూమ్రా రూపంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూలతో, పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దూమ్రా వారాహి అమ్మవారి రూపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
*నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు, ప్రజా సంక్షేమ సంకల్పం*
ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో ప్రతి రోజు అమ్మవారు ఒక విభిన్న అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.లోక కళ్యాణం కోసం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపతో అందరికీ సుభిక్షం కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ పూజారి పాలేపు అజయ్ శర్మ, అర్చకులు రాకేష్ మీశ్రా, హరీష్ భక్తుల గోత్రణామధులతో అర్చన చేసి ఆశీర్వధించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి - మంజుల దంపతులు, పాంపట్టి సులోచన, ఊటూరి కళ్యాణి, అర్చన, మహేందర్, చెల్లం సత్తయ్య, హరీష్,గంప రాములు, దొంతుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Telangana
*దూమ్రా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వారాహి మాత* *నాల్గవ రోజు ఘనంగా పూజలు* ---------------------------------------
Quick Summary:
నాల్గవ రోజు ఘనంగా పూజలు* -------------------------------
