నేటి సాక్షి గజ్వేల్ : --=
నాయకత్వం అంటే బ్యాడ్జి ధరించడం గానీ, పదవిని అనుభవించడం గానీ కాదని.. అది బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడమేనని గజ్వేల్ సీఐలు రవికుమార్, సత్యనారాయణ అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేత హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
విద్యార్థి నాయకులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, నాయకుడు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ముందుండి ఆచరించి చూపించే వ్యక్తి కావాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి నాయకత్వ పదవి గౌరవం మాత్రమే కాదని, పాఠశాల తమపై ఉంచిన నమ్మకానికి ప్రతీక అని అన్నారు. పాఠశాలలో క్రమశిక్షణను కాపాడటం నాయకుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమని అన్నారు. అలాగే సెయింట్ మేరీస్ విద్యానికేతను ప్లాస్టిక్ నిషేధిత పాఠశాలగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించి, పాఠశాలలోనే కాకుండా ఇళ్లలో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎన్నికైన విద్యార్థి నాయకులు తమ బాధ్యతలను నిజాయితీగా, క్రమశిక్షణతో నిర్వహించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేశారు.
ఎస్‌ఎస్‌సీ విభాగంలో జూపిటర్ హౌస్ కెప్టెన్‌గా బి. రిషికేష్, వీనస్ హౌస్ కెప్టెన్‌గా ఎం. హర్షవర్ధన్, మెర్క్యూరీ హౌస్ కెప్టెన్‌గా ఎన్. శ్రీకర్, నెప్ట్యూన్ హౌస్ కెప్టెన్‌గా బి. దీక్షిత్ ఎన్నికయ్యారు. సీబీఎస్‌ఈ విభాగంలో ఆకాశ్ హౌస్ కెప్టెన్‌గా యుగంధర్, అగ్ని హౌస్ కెప్టెన్‌గా పవన్, పృథ్వి హౌస్ కెప్టెన్‌గా చరణ్‌రాజ్, వాయు హౌస్ కెప్టెన్‌గా అంకిత్ పాల్ ఎన్నికయ్యారు. ఆయా హౌస్‌లకు వైస్ కెప్టెన్లను కూడా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి, ప్రిన్సిపాల్ కాటరాయప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
పదవి కాదు.. బాధ్యతే నాయకత్వం సెయింట్ మేరీస్ విద్యానికేతలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారం – సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని గజ్వేల్ సీఐల సూచన
Quick Summary:
సెయింట్ మేరీస్ విద్యానికేతలో విద్యార్థి నాయకుల
