*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
సిఐటియు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐడిఏ బాచుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో బొల్లారం చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
ఈ ప్రాంతంలోని పరిశ్రమలలో ప్రభుత్వ జీవో 6 అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ లు అమలు చేయాలని కోరుతూ బహిరంగ సభను ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా దాదాపు 300 మంది కార్మికులతో పెద్ద ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కనీస వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 6 ను అమలు చేయాల్సిందిగా కోరుతూ అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులకి తెలియజేయటానికి ఆయా పరిశ్రమలలో కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఉంటే పరిశ్రమల యాజమాన్యాలు బెదిరింపు చర్యలకు దిగటం కరెక్ట్ కాదని అలాంటి బెదిరింపులకు సిఐటియు భయపడదని ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగితే అక్కడ సిఐటియు ఎర్రజెండా కార్మికులకు అండగా ఉంటుందని ఇటువంటి బెదిరింపులు ఆపి జీవో నెంబర్ 6 అమలు చేయాలని యాజమాన్యాలకి హెచ్చరిక చేయటం జరిగింది. దేశంలో గాని రాష్ట్రంలో గాని కార్మికులను బెదిరించినటువంటి, కార్మికుల్ని ఇబ్బంది పెట్టినటువంటి యాజమాన్యాలను సిఐటియు గట్టిగా ఎదుర్కొని కార్మికులకు అన్యాయం జరగకుండా వారి డిమాండ్లు నెరవేరేలాగా సిఐటియు నాయకత్వంలో పోరాటం చేసిన చరిత్ర ఈ ఎర్రజెండా కుందని భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కనీస వేతన జీవో అమలు కోసం కార్మికుల పోరాటాలకి ఎర్రజెండా అండగా ఉంటుందని సిఐటియు మీకండగా ఉండి మొత్తం జిల్లా మొత్తం ఉన్నటువంటి కార్మికులు మీ డిమాండ్ల సాధనకు మీకు మద్దతు తెలుపుతారని తెలియజేస్తూ యాజమాన్యాలకి తీవ్రమైనటువంటి హెచ్చరిక చేసారు. సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జే, చంద్రశేఖర్ ఏ,అశోక్ మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ,పిఎఫ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న యజమాన్యాల పై చర్య తీసుకోవాలని బాచుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సిఐటియు నాయకులు కరపత్రాలు వేసి పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు, ఈఎస్ఐ,పిఎఫ్ ఇవ్వాలని వేస్తే యజమాన్యం సిఐటియు నాయకులను బెదిరించడం సిగ్గుచేటు అన్నారు, రాబోయే రోజుల్లో బాచుపల్లి ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక కార్మికులకు సీఐటీయూ ఎర్రజెండా అండగా నిలుస్తుందని తెలియజేశారు. సిఐటియు ఎర్రజెండాకు యజమాన్యం బెదిరింపులు కొత్త కావని హెచ్చరించారు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న కార్మికులకు సిఐటియు అండగా నిలుస్తూ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కోశాధికారి గణేష్, సిఐటియు జిల్లా నాయకులు వెంకటరామయ్య , వెంకటరాజ్యం , లింగస్వామి, రాజశేఖర్, సత్తిబాబు, సిఐటియు యంగ్ వర్కర్స్ కన్వీనర్ మణికంఠ, బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్, వివిధ పారిశ్రామిక కార్మికులు, మున్సిపల్ కార్మికులు, తోపుడు బండ్లు, ఆటో, సంత మార్కెట్, భవన నిర్మాణ, వివిధ మండలాల కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
*సిఐటియు ఆధ్వర్యంలో బొల్లారం చౌరస్తాలో బహిరంగ సభ*
Quick Summary:
సిఐటియు మేడ్చల్ జిల్లా కమిటీ