నేటిసాక్షి, నల్లగొండ :
మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధ ఆరోరా లా కాలేజీకి సంబంధించి కొన్ని మీడియా వేదికల్లో ప్రసారమవుతున్న కథనాలపై లా స్టూడెంట్ కత్తుల కాన్షీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, వాస్తవ నిర్ధారణ పూర్తికాకముందే ఏ విద్యాసంస్థపైనా ఏకపక్ష కథనాలు ప్రసారం చేయడం వల్ల సంస్థ ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. ఇటువంటి కథనాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ఏవైనా అక్రమాలు లేదా లోపాలపై అనుమానాలు ఉంటే, వాటిని సంబంధిత చట్టబద్ధమైన అధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాల్సిందే కానీ, విచారణకు ముందే మీడియా విచారణ పేరుతో తీర్పులు ఇవ్వడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
కొంతమంది వ్యక్తులు స్వప్రయోజనాల కోసం మీడియాను వినియోగిస్తూ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, అలాంటి అంశాలు నిజమైతే సంబంధిత అధికారులు సమగ్రంగా విచారించాలని ఆయన కోరారు. మీడియా ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని, అయితే ప్రతి కథనం వాస్తవ నిర్ధారణతో, నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా ప్రసారం కావాలని సూచించారు. ఆధారాలు లేకుండా ఏ సంస్థ లేదా వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం కాకుండా మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే చట్టం కల్పించిన హక్కుల ప్రకారం సంబంధిత వర్గాలు న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించవచ్చని పేర్కొంటూ, విద్యాసంస్థల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కత్తుల కాన్షీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లా విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
నిరాధార ప్రచారాలు నిలిపివేసి, వాస్తవ నిర్ధారణతో వ్యవహరించాలి -లా స్టూడెంట్ కత్తుల కాన్షీరామ్
Quick Summary:
-లా స్టూడెంట్ కత్తుల కాన్షీరామ్