నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
......................................
రైతులను ప్రేమించే వారందరికీ మేము తీసిన "హే చికీతా" సినిమా నచ్చుతుందని రచయిత, దర్శకులు ధన్ రాజ్ లెక్కల అన్నారు.సుందరకాండ మోషన్ పిక్చర్స్, అమరావతి మూవీ మేకర్స్ పథకం పై ధన్ రాజు లెక్కల దర్శకత్వంలో, గరుడ వేగా అంజి, అశోక్ ఆర్ఎన్ఎస్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం "హే చికీతా" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుoటుందని
దర్శకుడు తెలిపారు.
ఆదివారం హీరో అభినవ్ మణికంఠ, హీరోయిన్ దివిజా ప్రభాకర్, నటులు అంజిమామ, జబర్దస్త్ అజయ్, అశోక్ వర్ధన్, సాయి, క్రాంతిలతో కలిసి రచయిత,దర్శకులు ధన్ రాజ్ జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ సినిమా గురించి వివరించారు.అభినవ్, దివిజా ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న
ఈ సినిమా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగుతుందని... వ్యవసాయం చేసే రైతుకు ఇంకొక రైతు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వక పోవడం, వ్యవసాయాన్ని చిన్న చూపు చూడకూడదనే కాన్సెప్ట్ తోపాటు ఫ్యామిలీ, ఎంటైర్టైన్మెంట్, లవ్,యువతకు సందేశమిచ్చే రీతిలో చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని నాగునుర్ లచ్చక్కపేట,అల్లీపూర్,సారంగాపూర్, బీరుపూర్, జగిత్యాల టౌన్ తదితర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ఈ సినీమా షూటింగ్ చేసి పూర్తి చేశామన్నారు.జగిత్యాల జిల్లాలో సినిమా షూటింగులకు అనుకూలమైన మంచి లొకేషన్లు ఉన్నాయన్నారు.
ఐదుగురు యువకులైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇందులో నటించి మెప్పించారని తెలిపారు.
*చిత్ర హీరో అభినవ్ మణికంఠ, హీరోయిన్ దివిజా ప్రభాకర్ లు మాట్లాడుతూ*
రైతు నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఫన్, లవ్, ఎంటర్టైన్మెంట్ తో పాటు యువత ఏదో ఒక మంచి పని చేయవచ్చనే చక్కటి కాన్సెప్ట్, గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగె ఈ సినిమా అందరికి నచ్చుతుందని తెలిపారు.
చిన్న సినిమా అని చూడకుండా సకుటుంబ సపరివారంతో చూసి అందరించాలన్నారు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాగునుర్ లచ్చక్కపేట ప్రజల సహకారంతో షూటింగ్ సాఫిగా జరిగిందని, చిత్రాన్ని చూసి అందరించాలని కోరారు.
కథ, మాటలు, పాటలు, సంగీతం, ఫోటో గ్రఫీ చిత్రనికి హైలెట్ గా నిలుస్తాయని ధన్ రాజ్ అన్నారు.గరుడవేగా అంజి ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారని, హేచికీతా సినిమాలో నటించిన నటీ, నటులు, సాంకేతిక వర్గానికి, చిత్ర షూటింగుకు సహకరించిన జగిత్యాల పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు, మీడియా మిత్రులకు చిత్ర యూనిట్ పక్షాన ధన్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.ఐతే ఈ చిత్రంలో జగిత్యాలకి చెందిన జబర్దస్త్ అజయ్ ,మై విలేజ్ షో అంజిమమా,డ్యాన్సర్ రాకేష్, కొత్తపల్లి శ్రీను,
సంధ్యారాణి,అలేఖ్య,
పోలీస్ మల్లయ్య,
లెక్కల నారాయణ లు నటిస్తుండగా,
మాణిదీప్ రావు,రఘులు అసిస్టెంట్ డైరెక్టర్లుగా వ్యవహారించారని తెలిపారు.
సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, ఎడిటర్ బలగం మధు, కోరి్యోగ్రాపర్ గా ఈశ్వర్ పెంటి వ్యవహరించిన
"హే చికీతా" సినిమాను జూలై 24 న థియేటర్లలో విడుదల చేస్తున్నామని దర్శకుడు ధన్ రాజ్ లెక్కల తెలిపారు.
Telangana
*రైతులను ప్రేమించే వారందరికీ నచ్చుతుంది* *అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది* *ఈనెల 24 న *హే చికీతా* సినిమా విడుదల* *సినీ దర్శకులు ధన్ రాజ్ లెక్కల వెల్లడి* --------------------------------------
Quick Summary:
ఈనెల 24 న *హే చికీతా* సినిమా విడుదల*